: కథ అడ్డం తిరిగింది... కిడ్నాపర్లకు బడితెపూజ!
చిత్తూరు జిల్లాలోని ఉత్తరకండ్రిగ గ్రామ సర్పంచ్ కుమారుడిని అపహరించిన కిడ్నాపర్లు తమ యత్నం ఫలించిందని సంబరపడిపోయారు. సర్పంచ్ కుమారుడు బాలసుబ్రహ్మణ్యంతో చిత్తూరు జిల్లా సరిహద్దులు దాటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నాయుడు పేట చేరుకున్నారు. ఆ తర్వాత సర్పంచ్ కు ఫోన్ చేసి '5 లక్షలిస్తేనే నీ కుమారుడిని వదిలేస్తా'మని బేరం పెట్టారు. ఈ క్రమంలో బాలసుబ్రహ్మణ్యం కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకునే యత్నం చేశాడు. దీంతో అతడిని పట్టుకునేందుకు కిడ్నాపర్లు యత్నించడంతో నాయుడుపేట వాసులకు అనుమానం వచ్చి, కిడ్నాపర్లను పట్టుకున్నారు. విషయం తెలుసుకుని కిడ్నాపర్లకు బడితెపూజ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, బాధితుడిని స్వగ్రామం పంపేందుకు ఏర్పాట్లు చేశారు.