: ఐరాస చేరిన లఖ్వీ విడుదల వ్యవహారం... చర్చకు భద్రతా మండలి నిర్ణయం
ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ విడుదల వ్యవహారం ఐక్యరాజ్యసమితి చేరింది. లఖ్వీ విడుదల వ్యవహారంలో అనేక ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్ రాసిన లేఖకు ఐరాస భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రతినిధి జిమ్ మెక్ లే స్పందించారు. ఈ విషయంలో త్వరలో జరగనున్న భద్రతా మండలి భేటీలో చర్చించనున్నట్లు ఆయన ప్రకటించారు. ముంబై దాడుల నేపథ్యంలో భారత్ ఫిర్యాదుతో లఖ్వీని అరెస్ట్ చేసిన పాకిస్థాన్, ఆ తర్వాత విచారణ వేగంగా సాగడం లేదంటూ అతడిని ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చర్చించేందుకు భద్రతా మండలి అంగీకరించడంపై భారత్ హర్షం ప్రకటించింది.