: అమెరికా చేరిన నారా లోకేశ్... శాన్ ఫ్రాన్సిస్కోలో ఘన స్వాగతం


టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ అమెరికా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న నారా లోకేశ్ కు అక్కడి తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పసుపు కండువాలు ధరించిన తెలుగు యువత లోకేశ్ నినాదాలతో హోరెత్తించారు. దాదాపు 150 కార్లతో కూడిన భారీ ర్యాలీ వెంట రాగా లోకేశ్ విమానాశ్రయం నుంచి బస చేసే ప్రాంతానికి తరలివెళ్లారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం అమెరికా వెళ్లిన లోకేశ్, ఈ నెల 12 దాకా అక్కడ పర్యటించనున్నారు. స్మార్ట్ విలేజ్ పై ప్రచారం చేయనున్న లోకేశ్, ఈ నెల 7న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News