: అమెరికా టూర్ కు కేటీఆర్... పెట్టుబడుల కోసం ఎన్నారైలతో భేటీ


తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నారు. దాదాపు రెండు వారాల పాటు ఆయన అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా జరుపుతున్న ఈ పర్యటనలో కేటీఆర్, అమెరికాలోని పలువురు ఎన్నారైలను నేరుగా కలవనున్నారు. ప్రధానంగా ఐటీ ఆధారిత సేవల సంస్థలతో చర్చలు జరపనున్న కేటీఆర్, సదరు సంస్థల కార్యాలయాలు తెలంగాణలో ఏర్పాటయ్యేలా కృషి చేయనున్నారు.

  • Loading...

More Telugu News