: శివాజీ ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోవాలి: కామినేని


ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ నటుడు శివాజీపై మండిపడ్డారు. అసలు, శివాజీ తానే పార్టీలో ఉన్నారో తేల్చుకోవాలని అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై బీజేపీకి స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.... శివాజీ పాప్యులారిటీ కోసమే దీక్ష చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని, కేంద్రంలో వెంకయ్యనాయుడు, రాంమాధవ్, హరిబాబు వంటి నేతలున్నారని, వారు అనుసరించే వైఖరిని తాము గౌరవిస్తామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ శివాజీ గుంటూరులో ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. తన దీక్షకు అందరూ మద్దతివ్వాలని ఆయన కోరుతున్నారు.

  • Loading...

More Telugu News