: సిమ్మన్స్, పార్థివ్ ఫిఫ్టీలు... ముంబయి ఇండియన్స్ 172/3
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో పోరులో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్ 71, పార్థివ్ పటేల్ 59 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 26 పరుగులు చేసి జాన్సన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. పొలార్డ్ (7 నాటౌట్), రాయుడు (4 నాటౌట్) అజేయంగా నిలిచారు. చండీగఢ్ లోని మొహాలీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. పంజాబ్ జట్టులోనూ మ్యాక్స్ వెల్, మిల్లర్, సెహ్వాగ్ వంటి హిట్లర్లు ఉండడంతో ఛేదనపై ఆసక్తి నెలకొంది.