: భూకంప బాధితులకు చేతనైనంత సాయం చేయండి: అమీర్ ఖాన్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవలే భూకంపానికి గురైన నేపాల్ లో పర్యటించారు. అక్కడి పరిస్థితులను చూసి ఆయన చలించిపోయారు. చేతనైనంత సాయం చేయాలని అభిమానులు, ప్రజలకు పిలుపునిచ్చారు. బాధితులు ఏమీ పాలుపోని స్థితిలో దయనీయంగా కనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడం కలచివేసిందని చెప్పారు. ముఖ్యంగా, పిల్లలను ఆదుకునేందుకు సాయం చేయాలని ట్విట్టర్లో కోరారు. నేపాల్ లో గత నెలలో సంభవించిన భూకంపం వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. భారీ సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం చోటుచేసుకుంది.