: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ మధ్యాహ్నం బాంబు కలకలం రేగింది. స్టేషన్లో బాంబు ఉందంటూ రైల్వే అధికారులకు ఫోన్ కాల్ వచ్చింది. ఓ ఆగంతుకుడి నుంచి ఫోన్ రావడంతో ఆందోళన చెందిన అధికారులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. అణువణువు క్షుణ్ణంగా శోధించిన బాంబు స్క్వాడ్ ఎలాంటి బాంబు లేదని తేల్చింది. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ కాల్ ఆకతాయిల పనేనని నిర్ధారించారు.