: విజయవాడలో కాసేపట్లో పెళ్లి పెట్టుకుని వరుడు పరార్


విజయవాడలో కాసేపట్లో పెళ్లి అనగా, వరుడు పరారయ్యాడు. నగరంలోని పటమట లంకలో శ్రీకాంత్ అనే యువకుడు కట్నం తీసుకుని పరారయ్యాడంటూ, వధువు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. వరుడి నిర్వాకం కారణంగా పీటల మీద పెళ్లి ఆగిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ హఠాత్పరిణామంతో పెళ్లికూతురి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. తమకు న్యాయం చెయ్యాలంటూ అమ్మాయి తరపు బంధువులు ఆందోళనకు దిగారు. కాగా, ఫిర్యాదు అందుకున్న పోలీసులు పెళ్లికొడుకు తల్లి, తమ్ముడు, బావ, బాబాయ్ లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News