: వధువు పెట్టిన పరీక్షలో చేతులెత్తేసిన వరుడు... పెళ్లి క్యాన్సిల్


ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికరమైన ఉదంతం చోటుచేసుకుంది. ఓ యువతి చదువు రాని వ్యక్తిని భర్తగా అంగీకరించేది లేదంటూ తేల్చి చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది. వివరాల్లోకెళితే... యూపీలోని ఓ గ్రామంలో మనోజ్ అనే యువకుడి వివాహం నిశ్చయమైంది. అతడికి చదువు రాకున్నా, తల్లిదండ్రులు ఎలాగో మేనేజ్ చేసి, పెళ్లి కుదిర్చారు. అయితే, వధువుకు మనోజ్ తీరుపై అనుమానం వచ్చింది. ఆమె అతడికి ఓ పరీక్ష పెట్టింది. కరెన్సీ నోట్లు లెక్కించాలని కోరగా, అతడు నీళ్లు నమిలాడు. దీంతో, కనీసం లెక్కలు కూడా రాని వ్యక్తి తనకెందుకుని ఆ వధువు స్పష్టం చేయడంతో, పెళ్లి క్యాన్సిల్ అయింది. దీంతో, పోలీసులే ఇరువర్గాలకు మధ్యవర్తిత్వం వహించి, పెళ్లికి ముందు ఇచ్చిపుచ్చుకున్న నగానట్రా వంటి ఖరీదైన వస్తువులను ఎవరివి వారికి ఇప్పించి వ్యవహారాన్ని సెటిల్ చేశారు.

  • Loading...

More Telugu News