: కేసీఆర్ కు కావాల్సింది బంగారం ఉన్నవాళ్లే: పొన్నం ఫైర్
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ రాజకీయ శిక్షణ శిబిరం నిర్వహిస్తుండడంపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. రియల్ ఎస్టేట్ దందా చేసేవాళ్లు, భూ ఆక్రమణదారులకు టికెట్లు ఇచ్చారని, ఇప్పుడు వారికి దోపిడీ ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కావాల్సింది బంగారం ఉన్నవాళ్లేనని, అదే బంగారు తెలంగాణ పరమార్థమని వివరించారు. సాగర్ లో దొంగలను ఓ రూంలో వేసి, దోపిడీ ఎలా చేయాలన్నదానిపై తర్ఫీదునిస్తున్నారని ఎద్దేవా చేశారు.