: ఉస్మానియా యూనివర్శిటీలో పర్యటించనున్న రాహుల్ గాంధీ


వచ్చే వారంలో తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీలో పర్యటిస్తారని, ఒక రాత్రి అక్కడ బస చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రైతు సమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మెదక్ జిల్లాలో ఆయన పాదయాత్రను చేపట్టనున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సుమారు 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో వారిలో కొన్ని కుటుంబాలనైనా ఓదార్చాలని రాహుల్ ఈ యాత్ర తలపెట్టారు. కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసినందుకు రాహుల్ గాంధీని సన్మానించాలని నిశ్చయించిన ఓ విద్యార్థి సంఘం పంపిన ఆహ్వానం మేరకు ఆయన యూనివర్శిటీ పర్యటన ఖరారైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News