: రూ. 65 వేల కోట్లు నష్టపోయిన టాప్-9 కంపెనీలు
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో మార్కెట్ కాపిటలైజేషన్ పరంగా టాప్-10లోని కంపెనీలు 65,919 కోట్లు నష్టపోయాయి. ఈ జాబితాలో ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు తప్ప మిగిలిన అన్ని కంపెనీలూ గత వారం నష్టపోయాయి. ఈ వారంలో సెన్సెక్స్ 426 పాయింట్లు పడిపోయి 27,011 పాయింట్ల వద్ద కొనసాగిన సంగతి తెలిసిందే. సిగరెట్ల నుంచి హోటల్స్ వరకూ వివిధ విభాగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఐటీసీ అత్యధికంగా రూ. 19,958 కోట్ల మేరకు మార్కెట్ కాప్ ను కోల్పోయింది. ఓఎన్జీసీ రూ. 9,582 కోట్లు, కోల్ ఇండియా రూ. 8,306 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 6,184 కోట్లు, టీసీఎస్ రూ. 5,925 కోట్లు, రిలయన్స్ రూ. 5,343 కోట్లు, హెచ్ డీఎఫ్ సీ రూ. 4,361 కోట్లు, ఎస్ బీఐ రూ. 4,237 కోట్ల విలువను కోల్పోయాయి. ఇదే సమయంలో ఐసీఐసిఐ బ్యాంకు మార్కెట్ విలువ రూ. 13,464 కోట్ల రూపాయలు పెరిగి రూ. 1,92,077 కోట్ల వద్ద నిలిచింది.