: కడపలో పాగా వేసిన తెలుగుదేశం
కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్ష స్థానానికి తెదేపా సభ్యుడు అనిల్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అంతకుముందు నిర్ణీత సమయంలోగా అనిల్ కుమార్ ఒక్కడే నామినేషన్ దాఖలు చేశారు. కో ఆప్షన్ సభ్యులతో కలిపి తెలుగుదేశం పార్టీకి 12 మంది డైరెక్టర్లు, వైకాపాకు 9మంది డైరెక్టర్లు ఉన్నారు. దీంతో ఎలాగూ గెలవలేమన్న ఉద్దేశంతో వైకాపా ఈ ఎన్నికలను బహిష్కరించింది. దీంతో కడప డీసీసీబీ తెలుగుదేశం కైవసం అయింది. తొలుత కడప పీఠం వైకాపా చేతుల్లో ఉన్నప్పటికీ, తెదేపా ఆకర్ష రాజకీయాల ద్వారా వైకాపా నుంచి ఒక్కొక్కరుగా జారిపోయిన సంగతి తెలిసిందే.