: పవన్ కల్యాణ్ తలచుకుంటే ప్రత్యేక హోదా రావడం ఎంతసేపు?: శివాజీ
పవర్ స్టార్ తలచుకుంటే ప్రత్యేక హోదా వచ్చేస్తుందని సినీ నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై ఎందుకు ముందడుగు వేయడంలేదో పవన్ కల్యాణ్ ను అడగాలని ఆయన సూచించారు. తనకు ఎవరూ మద్దతు పలకాల్సిన అవసరం లేదని, ఎవరంతట వారు హోదా కోసం పోరాటం చేస్తే చాలని అన్నారు. పవన్ గట్టిగా కోరితే కేంద్రం దిగివచ్చి రాష్ట్రానికి స్పెషల్ స్టాటస్ ఇస్తుందన్న నమ్మకముందని వివరించారు. తన దీక్ష పూర్తి శాంతిమార్గంలో సాగుతుందని, ఎటువంటి రాడికల్ చర్యలకూ స్థానం లేదని అన్నారు.