: ఎంపీ గరికపాటి ఇంట్లో దుండగుల హల్ చల్


తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు ఇంట్లో గుర్తు తెలియని దుండగులు హల్ చల్ చేశారు. హైదరాబాదులో ఆయన ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. గరికపాటి పీఏ, డ్రైవర్ లపై దాడి చేశారని సమాచారం. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎంపీ స్వయంగా ఏసీపీకి ఫోన్ చేసి జరిగిన ఘటన గురించిన వివరాలు తెలిపారు. దీంతో స్పందించిన ఆయన ఎంపీ ఇంటికి వెళ్లి దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 10 మంది ఈ దాడిలో పాల్గొన్నారని, వారి ఉద్దేశం ఏంటో తనకు తెలియదని గరికపాటి రామ్మోహన్ రావు వివరించారు.

  • Loading...

More Telugu News