: ఐఎస్ఐఎస్ మరో కిరాతకం... 300 మందిని చంపేసిన దుర్మార్గులు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు. గతంలో అపహరించిన 300 మందికి పైగా యాజిడి ప్రోగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలను దారుణంగా హతమార్చారు. ఈ ఘటన శుక్రవారం నాడు జరిగిందని అధికారులు వివరించారు. ఇదొక ఘోరమైన చర్యని, ఇరాక్ సైన్యం మిగిలిన బందీలనైనా విడిపించాలని యాజిడి పార్టీ డిమాండ్ చేసింది. కొంతకాలం క్రితం వీరిని కిడ్నాప్ చేశారు. బందీలుగా పట్టుకున్న వారిలో యువతులను లైంగిక అవసరాలను తీర్చే బానిసలుగా మార్చారని ఆరోపించారు. తాము కిడ్నాప్ చేసిన బందీలను విడిచిపెట్టేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వారి కుటుంబాలను డబ్బు డిమాండ్ చేశారని తెలిపారు.