: స్నాప్ డీల్ సీఈఓపై ఎఫ్ఐఆర్ నమోదు


కేవలం గుర్తింపు పొందిన డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ తో మాత్రమే విక్రయించాల్సిన ఔషధాలను ఆన్ లైన్ లో అమ్ముతున్న ఈ-కామర్స్ సేవలందిస్తున్న స్నాప్ డీల్, ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కునాల్ భల్ పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. మహారాష్ట్ర ఎఫ్ డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ఈ కేసును దాఖలు చేసింది. ఈ తరహా అమ్మకాలు నిలిపివేయాలని స్నాప్ డీల్ కు గతంలో నోటీసులు కూడా జారీ చేశామని, అయినా సంస్థ స్పందించలేదని ఎఫ్ డీఏ కమిషనర్ హర్షదీప్ కాంబ్లీ వ్యాఖ్యానించారు. ఫ్లిప్ కార్ట్, అమేజాన్ వంటి కంపెనీలు కూడా ఈ తరహా విక్రయాలు సాగిస్తున్నాయా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఎఫ్ డీఏ ఆదేశాల మేరకు 1954 నాటి డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్, 1945 నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు. కాగా, గత నెలలో స్నాప్ డీల్ గోదాములపై ఎఫ్ డీఏ అధికారులు దాడులు జరుపగా, పెద్దఎత్తున ఔషధాలు పట్టుబడ్డ సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News