: కరవు సీమపై వడగండ్ల వాన


ఈ ఉదయం రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో కురిసిన వడగండ్ల వానకు పలు ఇళ్లు దెబ్బతినగా, కోతకు సిద్ధంగా ఉన్న మామిడి పంట నేలరాలి రైతుకు ఎనలేని బాధను మిగిల్చింది. పండ్ల తోటలు నాశనమైనట్టు వార్తలు వస్తున్నాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పోతుకుంట వద్ద రెండు హైటెన్షన్ విద్యుత్ టవర్లు కూలిపోగా, పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు కడప జిల్లాలోనూ ఈ ఉదయం వర్షాలు పడ్డాయి.

  • Loading...

More Telugu News