: ఈ 11 ఏళ్ల అంధబాలుడు న్యూస్ యాంకర్


టీవీ చానల్ లో వార్తలు లైవ్ లో చదవాలంటే ఎంతో సామర్థ్యం ఉండాలి. స్పష్టంగా, తప్పులు లేకుండా చదవడంలో ప్రావీణ్యం ఉండాలి. వీటిని పుష్కలంగా కలిగున్న 11 సంవత్సరాల అంధ బాలుడికి న్యూస్ యాంకర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. సాధించాలన్న తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు కోయంబత్తూరుకు చెందిన శ్రీరామానుజం. ఈ బాలుడు పుట్టుకతోనే అంధుడు. కానీ, యాంకర్ కావాలన్న కోరికతో బ్రెయిలీ లిపిలో ఉండే వార్తలు చదవడం ద్వారా ప్రాక్టీసు చేశాడు. అతడి కోరికను తెలుసుకున్న 'లోటస్ టీవీ' చానల్ ఓ అవకాశం ఇచ్చింది. 22 నిమిషాల బులెటిన్ ను విజయవంతంగా ప్రజెంట్ చేశాడు. దీంతో అతనితో వారానికి ఒకరోజు వార్తలు చదివించాలని, భవిష్యత్తులో పూర్తి స్థాయి న్యూస్ యాంకర్ గా చేస్తామని టీవీ చానల్ చైర్మన్ జీకేఎస్ సెల్వకుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News