: ప్రతి ఇంటికీ కొత్త రంగులు వేసుకోండి: చంద్రబాబు సూచన


త్వరలో రానున్న గోదావరి పుష్కరాలను ఓ పెద్ద పండగలా నిర్వహించుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ ఇండ్లకు కొత్త రంగులు వేసుకోవాలని, ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రజలు పుష్కరాలను 12 రోజుల పండగగా భావించాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ విషయాన్ని పుష్కరాల ప్రత్యేక అధికారి జె మురళి మీడియాకు తెలిపారు. పుష్కర ఏర్పాట్లపై ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయాలని, రాజమండ్రి నగరంలోని ప్రధాన రోడ్లు, జంక్షన్లను అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దాలని సిఎం ఆదేశించినట్టు వివరించారు. రోడ్డు కమ్ రైలు వంతెనకు ఉన్న అన్ని స్తంభాలపైనా బొమ్మలు వేయనున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News