: ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో బాలికలదే పైచేయి
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను ఈ ఉదయం మంత్రి పార్థసారధి విడుదల చేశారు. మొత్తం 54.6శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలలో బాలికలదే పైచేయిగా ఉంది. బాలురు 50.22శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 59.46శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 74శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉంది. 40శాతం ఉత్తీర్ణతతో మహబూబ్ నగర్ జిల్లా ఆఖరున నిలిచింది. గతేడాది కంటే అదనంగా ఒక శాతం ఉత్తీర్ణత సాధించామని మంత్రి తెలిపారు. ఫలితాల కోసం http://examresults.ap.nic.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.