: 'లెజెండ్' కంటే 'లయన్' పెద్ద హిట్టవుతుంది: కేఈ
'లెజెండ్' సినిమా కంటే 'లయన్' పెద్ద హిట్టవుతుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన 'లెజెండ్' 400 రోజుల విజయోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, బాలకృష్ణ సినిమాలంటే తనకు అంతులేని అభిమానమని అన్నారు. బాలయ్య నటించిన ప్రతి సినిమా మాస్టర్ పీస్ అని ఆయన అభివర్ణించారు. తెలుగు సినిమా కలెక్షన్ల రేంజ్ ను పెంచిన సినిమా 'సమరసింహారెడ్డి' అని ఆయన చెప్పారు. బాలయ్య బాబు నటించిన సినిమాల్లో 'భైరవద్వీపం', 'శ్రీ రామరాజ్యం', 'నరసింహనాయుడు', 'లెజెండ్' సినిమాలు తనకు చాలా ఇష్టమని ఆయన తెలిపారు. ఆయన మరిన్ని సినిమాల్లో నటించి, అభిమానుల ఆదరణ పొందాలని కేఈ ఆకాంక్షించారు.