: ఈ పోరాటంలో ప్రాణం పోయినా సరే...రాష్ట్రానికి న్యాయం జరగాలి: సినీ నటుడు శివాజీ
రాష్ట్ర ప్రజల కోసం రేపు ఉదయం 10:30 నిమిషాలకు గుంటూరులో నిరాహారదీక్ష చేపడతానని సినీ నటుడు శివాజీ తెలిపాడు. గుంటూరు చేరుకున్న శివాజీ అక్కడ మాట్లాడుతూ, తాను రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నానని అన్నాడు. ఈ పోరాటంలో ప్రాణం పోయినా పర్వాలేదని, ప్రజల కోసం, ఓ కారణం కోసం పోరాడిన వ్యక్తిగా నిలిచిపోతానని శివాజీ చెప్పాడు. చట్టమన్నా, న్యాయమన్నా తనకు గౌరవం ఉన్నాయని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని శివాజీ తెలిపాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా కావాలని, దాని కోసమే తాను పోరాడుతున్నానని శివాజీ స్పష్టం చేశాడు. దీక్ష స్థలం నుంచి ఖాళీ చేయిస్తే ఇంకో చోటు నుంచి పోరాటం చేస్తానని శివాజీ చెప్పాడు. తనది పోరాటమే తప్ప, రాజకీయం కాదని శివాజీ తెలిపాడు.