: సినీ నటి నీతూ అగర్వాల్ కు బెయిలివ్వలేదు
ఎర్రచందనం స్మగ్లింగు కేసులో అరెస్టయిన సినీ నటి నీతూ అగర్వాల్ కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. రిమాండ్ ఖైదీగా నెల్లూరు జిల్లా నంద్యాల జైలులో ఉన్న నీతూ అగర్వాల్ బెయిల్ పిటిషన్ ను ఆళ్లగడ్డ న్యాయస్థానం తిరస్కరించింది. రుద్రవరం జైలులో రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో నీతూ అగర్వాల్ ను నంద్యాల జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆమె బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. న్యాయస్థానం బెయిల్ తిరస్కరించడంతో ఆమె మరిన్ని రోజులు జైలులో గడపనున్నారు.