: స్కూటర్ పై నుంచి జారిపడి దెబ్బలు తగిలించుకున్న బాలీవుడ్ హీరో
సినిమాలో స్కూటర్ పై సవారీ చేసే సన్నివేశంలో పాల్గొన్న బాలీవుడ్ కుర్రహీరో దానిపై నుంచి పడి దెబ్బలు తగిలించుకున్నాడు. 'బాంబైరియా' అనే సినిమాలో పింక్ రంగు స్కూటర్ మీద తిరుగుతూ ఉండే హీరో సిద్ధాంత్ కపూర్, ఓ ఛేజింగ్ సీన్ చేస్తూ అదుపు తప్పి స్కూటర్ పై నుంచి పడిపోయాడు. దీంతో సిద్ధాంత్ కపూర్ కు దెబ్బలు తగిలాయి. అయినా సరే సీన్ పూర్తి చేస్తానని పట్టుబట్టాడు. ఈ యాక్సిడెంట్ కారణంగా పాత్రకు మరింత దగ్గరయ్యానని సిద్ధాంత్ చెప్పాడు. చిన్న యాక్సిడెంట్ కారణంగా షెడ్యూలు వృథా కావడం ఇష్టం లేదని, అయినా సెట్లలో చిన్న ప్రమాదాలు జరగడం మామూలేనని అన్నాడు. ఈ సినిమాలో కొరియర్ బాయ్ పాత్రలో అలరించే తనకు స్కూటర్ తో మంచి అనుబంధం ఉంటుందని వెల్లడించాడు.