: భారత సహాయక చర్యలపై నేపాలీ నేతల్లో ఆందోళన


నేపాల్ లో సంభవించిన భూకంపం నేపథ్యంలో భారత్ అందిస్తున్న ఆపన్నహస్తం ఆ దేశ నేతల్లో ఆందోళన రేపుతోంది. భూకంపం సంభవించగానే నేపాల్ కంటే ముందుగా స్పందించిన భారత్ ప్రపంచ దేశాల అభిమానం చూరగొంది. అయితే నేపాల్ రాజకీయ పార్టీలు మాత్రం భారత్ సైనికుల చర్యలు చైనా-నేపాల్ మధ్య సంబంధాలపై ప్రభావం చూపేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ, ఆ దేశ పత్రికలు కథనాలు ప్రచురించాయి. త్రిభువన్ ఎయిర్ పోర్టు, నేపాల్-చైనా సరిహద్దుల్లో మాత్రమే భారత సైన్యం కదలికలు ఉన్నాయని ఇది తమ రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని నేపాల్ కమ్యూనిస్టు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భూకంప అనంతర పరిస్థితులపై నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో యూసీపీఎన్ (యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్టు) ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది. సహాయం పేరిట భారత సైన్యం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని, వారికి మార్గదర్శకాలు సూచించాలని కోరింది.

  • Loading...

More Telugu News