: ఐఎస్ తీవ్రవాదులు ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభించారు
ప్రపంచంలో అత్యంత ధనిక తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఇరాక్ లో ఫైవ్ స్టార్ హోటల్ ను ఏర్పాటు చేశారు. నినావా పేరిట 262 గదులు కలిగిన ఈ ఫైవ్ స్టార్ హోటల్ లో యుద్ధాల్లో పాల్గొనే తీవ్రవాదులు సేదదీరుతారు. ఇక్కడ వినోద కార్యక్రమాలు జరగనప్పటికీ, కమాండర్లు కోరుకుంటే వివాహాలు జరగవచ్చు. ఈ హోటల్ లో పనిచేసే మహిళలంతా పై నుంచి కింది వరకు నల్లని దుస్తులు (బురఖా) ధరించాలి. సిరియా ఇరాక్ దేశాల్లోని తమ అధీన ప్రాంతాల్లో హోటళ్లన్నీ మూయించిన ఐఎస్ ఇప్పుడు సొంతంగా ఫైవ్ స్టార్ హోటల్ తెరవడం విశేషం. ఈ హోటల్ ను కేవలం కమాండర్లు మాత్రమే వినియోగించేందుకు ఐఎస్ నిర్ణయించింది.