: బ్రిటన్ రాజకుటుంబంలోకి బుల్లి యువరాణి
బ్రిటన్ రాజకుటుంబంలోకి మరో బుల్లి యువరాణి వచ్చి చేరింది. ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్ టన్ దంపతులకు మరో బిడ్డ జన్మించింది. లండన్ లోని సెయింట్ మేరీస్ అసుపత్రిలో కేట్ మిడిల్ టన్ ఈ రోజు ఆడపిల్లకు జన్మనిచ్చిందని రాజకుటుంబ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, ఇదే ఆసుపత్రిలో ఆమె 2013లో మొదటి సంతానం ప్రిన్స్ జార్జ్ కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాజకుటుంబంలో యువరాజు, యువరాణి వచ్చి చేరారు.