: పరిటాల సునీతను సంతృప్తి పరిచేందుకే పోలీసులు ఆరాటపడుతున్నారు: అనంత వెంకట్రామిరెడ్డి


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేత, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైకాపా నేతలు, కార్యకర్తలను హతమారుస్తున్నారని... ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతోందని ఆరోపించారు. తమ పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్య కేసును విచారించకుండా పక్కన పెట్టి... వైకాపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పరిటాల సునీతను సంతృప్తి పరిచేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News