: నేపాల్ లో ఇప్పుడు మాంసాహారం నిషిద్ధం


భూకంపం ధాటికి విలవిల్లాడుతున్న నేపాల్ లో మాంసాహారాన్ని నిషేధించారు. భూకంపం కారణంగా వేలాది మంది మృత్యువాత పడడంతో మాంసాహారం భుజించడం వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని భావించిన నేపాల్ ప్రభుత్వం మాంసాహారాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. భూకంప శిథిలాలను పూర్తిగా తొలగించి, పరిశుభ్రవాతావరణం నెలకొనేంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భూకంపం ధాటికి, ప్రభుత్వ లెక్కల ప్రకారం 6,600 మంది మృతి చెందినట్టు సమాచారం. కాగా, పది వేలకు పైగా క్షతగాత్రులుగా మారినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News