: తుగ్లక్ పాలన కంటే కేసీఆర్ పాలన అధ్వానం: షబ్బీర్ అలీ


తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మరోమారు ఫైరయ్యారు. పిచ్చి తుగ్లక్ సాగించిన పాలన కంటే కూడా కేసీఆర్ పాలన అధ్వానంగా ఉందని ఆయన విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ యాత్రను పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన షబ్బీర్, 11 నెలల్లో కేసీఆర్ సర్కారుకు మొట్టికాయలేస్తూ హైకోర్టు 11 తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పులే కేసీఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనమని ఆయన చెప్పారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో అవస్థలు పడుతున్న అన్నదాతకు భరోసా ఇచ్చేందుకే రాహుల్ గాంధీ పర్యటనలు చేస్తున్నారని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రాహుల్ పర్యటనను అడ్డుకోవాలని చూసేవారికి రైతులే తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News