: కాంగ్రెస్ చేస్తున్నది దీక్ష కాదు... దొంగ జపం: ఏపీ మంత్రి దేవినేని
ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ నేతలు గుంటూరులో చేస్తున్న దీక్షపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఉదయం కర్నూలు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైఖరిని తూర్పారబట్టారు. రాజధాని ఎక్కడో కూడా తేల్చకుండానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలుచెక్కలు చేసిందని ఆయన ఆరోపించారు. రాజధాని లేని అవశేష ఆంధ్రప్రదేశ్ కు కారణమైన కాంగ్రెస్, తాజాగా ఆ నెపాన్ని టీడీపీపైకి నెట్టే క్రమంలోనే దీక్షలకు దిగుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది దీక్ష కాదని దొంగ జపమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.