: కొత్త సభ్యులకు సీనియర్లు మార్గదర్శనం చేయాలి: టీఆర్ఎస్ శిక్షణలో జేఎం లింగ్డో
చట్టసభలకు కొత్తగా ఎన్నికయ్యే సభ్యులకు సీనియర్లు మార్గదర్శకులుగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ జేఎం లింగ్డో అన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలకు నేటి ఉదయం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథులుగా జేఎం లింగ్డోతో పాటు ప్రముఖ ఆర్థికవేత్త హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా లింగ్డో మాట్లాడుతూ కొత్త సభ్యులకు సభా వ్యవహారాలు, నియమ నిబంధనలపై సీనియర్లు దిశానిర్దేశం చేయాలని చెప్పారు.