: రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు


తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పిల్లలు, వృద్ధులు తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో, విశాఖలో ఉన్న తుపాను హెచ్చరికల కేంద్రం చల్లటి కబురు అందించింది. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని, దీనికి తోడు సాయంత్రంలోగా క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది.

  • Loading...

More Telugu News