: కొలువుదీరిన టీటీడీ కొత్త పాలక మండలి... చదలవాడ సహా పాలకవర్గం ప్రమాణం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలక మండలి కొద్దిసేపటి క్రితం కొలువుదీరింది. శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద పాలకమండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గతవారమే పాలకవర్గాన్ని ఖరారు చేస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నా, సుముహూర్తం కోసం వేచిచూసిన పాలకమండలి నేటి ఉదయం సరిగ్గా 11.09 గంటలకు బాధ్యతలు చేపట్టింది. టీటీడీ సభ్యుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు పాలక మండలి సభ్యులంతా ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా రామచంద్రనాయుడు హాజరయ్యారు.