: పదవులు శాశ్వతం కాదు... సేవ చేయడమే గొప్ప: కొత్త ఎమ్మెల్యేలతో కేసీఆర్


టీఆర్ఎస్ పార్టీ తరఫున కొత్తగా చట్టసభలకు ఎన్నికైన సభ్యులకు కొద్దిసేపటి క్రితం శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ లో ప్రారంభమైన ఈ శిక్షణా తరగతుల్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. పదవులు శాశ్వతం కాదని చెప్పిన ఆయన సేవ చేయడాన్నే గొప్పగా భావించాలని కొత్త సభ్యులకు సూచించారు. ప్రజల పోరాటంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయను సమర్థవంతంగా కొనసాగిస్తామని చెప్పిన కేసీఆర్, ఇకపై ప్రతి ఆరు నెలలకోసారి శిక్షణా తరగతులను నిర్వహిస్తామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News