: 137 ఐటీ కంపెనీలకు లేఖ రాసిన ఏపీ ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం యత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో, రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఏకంగా 137 ఐటీ కంపెనీలకు లేఖలు రాశారు. సంస్థలు స్థాపించేందుకు ఏపీ అత్యంత అనువైన ప్రాంతమని... అంతేకాకుండా, సింగిల్ విండో విధానం ద్వారా కేవలం 28 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని లేఖలో తెలిపారు. వ్యాట్, స్టాంప్ డ్యూటీ, పవర్ సబ్సిడీలతోపాటు రిక్రూట్ మెంట్ అసిస్టెన్స్ కూడా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో ఐటీ ద్వారా 5 లక్షల ఉద్యోగాలను కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. లేఖలు రాసిన కంపెనీలలో మైక్రోసాఫ్ట్, విప్రో, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, హెచ్ సీఎల్ వంటి దిగ్గజాలు కూడా ఉన్నాయి.

  • Loading...

More Telugu News