: సల్మాన్ ఖాన్ పక్కన హీరోయిన్ గా అవకాశమిస్తానంటూ మోసం


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా అవకాశమిస్తానని మాయమాటలు చెప్పి ఓ యువతిని అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. రాజస్థాన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...రాజస్థాన్ కి చెందిన ఓ బంగారు వ్యాపారి సల్మాన్ ఖాన్ తో పాటు నటిస్తున్నానని, అతని సరసన హీరోయిన్ గా అవకాశం కల్పిస్తానని ఓ యువతికి మాయమాటలు చెప్పాడు. సల్మాన్ తో నటిస్తున్నట్టు వాట్సప్ లో ఫోటోలు ఆ యువతికి పంపి నమ్మించాడు. అతని మాటలు, ఫోటోలు నిజమని నమ్మిన ఆ యువతిపై జైపూర్ లోని ఓ హోటల్ లో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News