: అనుష్క తరువాత రకుల్ : గోపీచంద్ మలినేని
తెలుగు సినీ పరిశ్రమకు రకుల్ ప్రీత్ సింగ్ రూపంలో మరో అనుష్క దొరికిందని 'పండగ చేస్కో' దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పాడు. 'పండగ చేస్కో' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా 'లక్ష్యం', 'భిల్లా' సినిమాలు చేసినప్పుడు అనుష్కలోని డెడికేషన్, ప్రతిభ, అణకువను చూసి ఆశ్చర్యపోయానని, ఇప్పుడు రకుల్ లో అలాంటి లక్షణాలు చూశానని అన్నాడు. హీరో రామ్ ఎనర్జీ తిరుగులేనిదని, ఆయనతో పని చేయడం మరపురాని అనుభూతి అని ఆయన వెల్లడించాడు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆయన తెలిపాడు. అద్భుతమైన పాటలను తమన్ అందించాడని ఆయన చెప్పాడు.