: 'పండగ చేస్కో' సినిమా పండగలా ఉంటుంది: బ్రహ్మానందం


'పండగ చేస్కో' సినిమా పండగలా ఉంటుందని బ్రహ్మానందం చెప్పాడు. 'పండగ చేస్కో' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో రామ్ ఇద్దరు అమ్మాయిలతో ఆకలిగొన్న పులిలా నటించాడని చెప్పాడు. రామ్ తరువాత ఇద్దరు ముద్దుగుమ్మలు బాగా నటించారని అన్నాడు. సినిమాలో 20 సీన్లలో నటించానని, అందులో వారిద్దరూ మంచి ప్రతిభ కనబరిచారని వెల్లడించాడు. కోతుల్లాంటి తమను డీల్ చేయడం సామాన్యమైన విషయం కాదని, అయినప్పటికీ దర్శకుడు గోపి మంచి ఫలితాలు రాబట్టుకున్నాడని బ్రహ్మీ తెలిపాడు. తమన్ ఫామ్ కోల్పోలేదని, ఈ సినిమాతో మరోసారి జోరందుకుంటాడని చెప్పాడు. తనను రామ్ 'తమ్ముడూ' అని పిలుస్తాడని, 'రెఢీ' దగ్గర్నుంచి అలాగే 'అన్నయ్యా' అంటున్నానని, ఇప్పుడు కూడా రామ్ అన్నయ్య బాగా నటించాడని బ్రహ్మీ చెప్పాడు. ఈ సినిమాలో తన పాత్ర పేరు 'వీకెండ్ వెంకట్రావ'ని ఆయన వెల్లడించాడు.

  • Loading...

More Telugu News