: 60 సీసీ కెమెరాలతో నిఘా: సీవీ ఆనంద్
ఐపీఎల్ లో భాగంగా రేపు జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాదు మ్యాచ్ కు 60 సీసీ కెమేరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రేపటి మ్యాచ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఈ ఏర్పాట్లు చేశామని అన్నారు. స్టేడియంలో 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఈవ్ టీజర్స్ ను అదుపు చేసేందుకు షీ టీమ్స్ ను రంగంలోకి దించామని ఆయన చెప్పారు.