: ఓపెనర్సే ఉతికేశారు...పంజాబ్ పై ఢిల్లీ విజయం


ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టును ఓపెనర్లు గెలిపించారు. బౌలింగ్, బ్యాటింగ్ లో సత్తా చాటిన ఢిల్లీ జట్టు భారీ విజయం నమోదు చేసింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి సెహ్వాగ్ (1), వోహ్రా (1), షాన్ మార్ష్ (5), పెరీరా (3) దారుణంగా విఫలమయ్యారు. డేవిడ్ మిల్లర్ (42), బెయిలీ (18) చివర్లో అక్షర్ పటేల్ (22) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ జట్టు 118 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (52), శ్రేయస్ అయ్యర్ (54) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో ఢిల్లీ జట్టు ఇంకా 37 బంతులు మిగిలుండగానే 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగు వికెట్లు తీసి పంజాబ్ ను కుప్పకూల్చిన కౌల్టర్ నైల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచాడు.

  • Loading...

More Telugu News