: పూటుగా తాగి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు
తన తమ్ముడి పెళ్లికి పుట్టింటి నుంచి డబ్బులు తేలేదని పూటుగా తాగేసి భార్యపై కిరోసిన్ పోసి, కాల్చి చంపాడో భర్త. ముంబై సమీపంలోని అంబర్ నాథ్ ప్రాంతానికి చెందిన నేవాలిపాడులో నివసించే బర్ఖుజాదవ్ (36) తాగి వచ్చి తన తమ్ముడి పెళ్లికి 5000 రూపాయలు పుట్టింటి నుంచి తీసుకురాలేదని, భార్య పార్వతితో గొడవ పడ్డాడు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీనిని గమనించిన స్థానికులు ఆమెను ఉల్హాన్ నగర్ సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. బర్ఖూజాదవ్ పరారీలో ఉండడంతో అతనిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.