: మంత్రి పరిటాల సునీత అలిగారు!


ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పోలీసుల తీరుపై అలకబూనినట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా రాప్తాడులో రెండు రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ నేత ప్రసాదరెడ్డి హత్యకేసులో ఎస్ఐ, సీఐలను డీఐజీ వీఆర్ కు పంపడంపై ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం తనకు కేటాయించిన ముగ్గురు గన్ మెన్, ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందిని వెనక్కి పంపేశారు. వారిని తిప్పి పంపిన విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పాలని ఆమె వారికి సూచించారు. కాగా, వైఎస్ఆర్సీపీ నేత ప్రసాదరెడ్డి హత్య కేసులో ఇటుకులపల్లి ఎస్ఐ, రాప్తాడు సీఐలను డీఐజీ బాలకృష్ణ వీఆర్కు పంపిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News