: థాయ్ లాండ్ లో 'రోహింగ్యా' తెగ మృతదేహాలు లభ్యం


మయన్మార్ లో తీవ్ర వివక్షకు గురయ్యే రోహింగ్యా తెగకు చెందిన 32 మంది మృతదేహాలు థాయ్ లాండ్ లో బయటపడ్డాయి. ఈ విషయాన్ని థాయ్ పోలీసులు వెల్లడించారు. ఈ మృతదేహాలతో పాటు ఓ వ్యక్తి సజీవంగా లభ్యం కావడం విశేషం. అయితే అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. కొన్ని మృతదేహాలను పూడ్చిపెట్టగా, మరికొన్ని మృతదేహాలపై వస్త్రాలు, దుప్పట్లు కప్పి ఉంచడాన్ని థాయ్ పోలీసులు గుర్తించినట్టు చెప్పారు. థాయ్ లాండ్ లోని దక్షిణ సోంగ్లా ప్రావిన్స్ పరిధిలోని పర్వత ప్రాంతంలో ఈ మృతదేహాలు లభ్యమైనట్టు థాయ్ పోలీసులు చెప్పారు. కాగా, మయన్మార్ లో రోహింగ్యా తెగకు చెందిన వారు తీవ్ర వివక్షకు గురవుతారు. దీంతో వారు తరచూ విదేశాలకు వలస వెళ్లిపోతుంటారు. అలా వలస వచ్చి మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News