: ఎక్స్ రే రూంలో అత్యాచారయత్నం


పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఓ యువతిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడో ప్రబుద్ధుడు. భీమవరం సమీపంలోని వీరవాసరానికి చెందిన యువతి కిడ్నీలో రాళ్లు ఏర్పడడంతో చికిత్స నిమిత్తం ఏలూరులోని ఆశ్రం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గత నెల 28న చేరింది. వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీయాలని సూచించడంతో, ఆమె ఆసుపత్రిలోని ఎక్స్ రే కోసం ల్యాబ్ అసిస్టెంట్ రాజును కలిసింది. ఎక్స్ రే తీస్తానని చెప్పిన రాజు, ఆమెను ఎక్కడ పడితే అక్కడ తాకడం మొదలు పెట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆమె బయటికి పరుగుతీసి, తల్లితో కలిసి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News