: ఏపీ ఉద్యోగుల పీఆర్సీపై జీవో జారీ
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉద్యోగుల పీఆర్సీపై జీవో జారీ చేసింది. డీఏను 5.24 శాతం ఖారారు చేసినట్టు అందులో తెలిపింది. 32 సెగ్మెంట్లు, 80 గ్రేడ్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా కనిష్ఠ వేతనం రూ.13వేలు, గరిష్ఠ వేతనం రూ.1,10,850 కానుంది. 2013 జులై నుంచి నోషనల్ బెనిఫిట్, 2014 జూన్ నుంచి 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వనున్నట్టు జీవోలో పేర్కొంది.