: రాహుల్ పర్యటనలో రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలి: వీహెచ్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మే రెండవ వారంలో రైతు భరోసా యాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి పీసీసీ లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన, తనవంతుగా లక్ష రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. తనలానే మిగతా నేతలు కూడా లక్ష విరాళం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 500 మంది కార్యకర్తలు రాహుల్ వెంట తరలిరావాలని వీహెచ్ కోరారు.