: ఆమె ఒక్కతి...11 మంది కీచకులు...బలైపోయింది
పంజాబ్ లోని మోగా జిల్లాలో మరోదారుణం చోటుచేసుకుంది. లైంగిక వేధింపులకు పాల్పడి తల్లీకూతుళ్లను బస్సులోంచి తోసేసిన ఘటనకు పాల్పడిన 24 గంటల్లోపే అదే జిల్లాలో మరో దుర్మార్గం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాధితురాలు తన స్నేహితురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లింది. ఆమె ఇంట్లో లేకపోవడంతో ఆమె కోసం బాధితురాలు వేచిచూస్తుండగా, స్నేహితురాలి భర్త, గ్రామంలోని మరో పది మందితో ఆమెను ఓ పాడుబడిన ఇంట్లోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వారిని ప్రతిఘటించేందుకు ఎంత ప్రయత్నించినా 11 మంది కామాంధుల చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో, వారందరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు, ఎవరినీ అదుపులోకి తీసుకోకపోవడం విశేషం.